సింగపూర్ తెలుగు సమాజం 40వ వార్షికోత్సవాలలో భాగంగా 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు


తెలుగు భాషాభిమానులకు శుభవార్త!

 

సింగపూర్ తెలుగు సమాజం 40వ వార్షికోత్సవాలలో భాగంగా 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు మన సింగపూర్ లో నవంబర్ 5,6 తేదీలలో జరగబోతోంది. సింగపూర్ తెలుగు సమాజం, వంగూరి ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి నేతృత్వంలో, లోక్ నాయక్ ఫౌండేషన్ మరియు మలేషియా తెలుగు సంఘం సంయుక్తంగా మరియు హాంగ్ కాంగ్, ఇండోనేషియా, మియన్మార్, థాయిలాండ్,బ్రూనై,మారిషస్ మొదలగు దేశాల తెలుగు సంస్థల సహకారంతో జరగనున్న ఈ సదస్సుకు మీ అందరికి ఇదే మా సాదర ఆహ్వానం. తెలుగు వారందరూ ఒకే వేదిక పై తమ తెలుగు సాహిత్యాభిమానాన్ని తోటి భాషాభిమానులతో పంచుకోవడం, తెలుగు సాహిత్యం ప్రపంచ వ్యాప్తికి ప్రణాళికలపై చర్చించడం వంటి ముఖ్య ఉద్దేశాలు గల ఈ సదస్సుకు మీ సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాం. స్వీయరచనాపఠనం, సాహిత్య ప్రసంగాలు, చర్చావేదికలు, సరదా సాహిత్య పోటీలు, గొలుసు కథ వంటి అంశాలతో ముందుకొస్తున్న ఈ సదస్సులో మీ రచనలనూ, సాహిత్య పరమైన అభిప్రాయాలను, విశ్లేషణలను, పాండిత్య ప్రతిభను సహసాహితీవేత్తలతో పంచుకునేందుకు ఇది సరైన అవకాశం.  

 

అలాగే మీరందరూ కూడా మన వెబ్సైటు లో నమోదు చేసుకోవలసిందిగా ప్రార్ధన.

Tickets Link : https://goo.gl/DnWjHk

Donations Link: https://goo.gl/NJvpd3

5th World telugu Sahithi Sadassu

 

5th World telugu Sahithi Sadassu

 5th World telugu Sahithi Sadassu